08-05-2024 RJ
సినీ స్క్రీన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 రోజుకో సంచలన వార్తను తెస్తోంది. ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్‌లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. తాజాగా మరో భారీ అప్డేట్ సోషల్ విూడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. కల్కి సినిమా కాస్టింగ్ లిస్టులో మరో సూపర్ స్టార్ చేరాడని అంటున్నారు.. ఆ స్టార్ మరెవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. అవును.. కల్కి సినిమాలో మహేష్ బాబు కూడా భాగం కానున్నాడట. సినిమాలో ప్రభాస్ విష్ణు అవతారం ఎంట్రీ సమయంలో వచ్చే సీన్ కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడట.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ విూడియాలో వైరల్ గా మారింది. అయితే.. ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ,, నిజమైతే మాత్రం కల్కి సినిమా స్థాయి నెక్ట్స్ లెవల్‌కి వెళ్లడం ఖాయం. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి స్టార్స్ నటిస్తున్నారు. వైజయంతి మూవీ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి స్టార్ కాస్టింగ్ తో, భారీ అంచనాల మధ్య వస్తున్న కల్కి సినిమా ఇండియన్ సినిమాపై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.