08-05-2024 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కొత్త సినిమాను ప్రకటించారు. హీరోగా తన పెద్ద కుమారుడు రాజా గౌతమ్ నటిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాలో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్.. తాతా మనవళ్లుగా నటిస్తుండగా.. ఈ సినిమాకు బ్రహ్మ ఆనందం అనే ఫన్నీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్క నిర్మిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు ఆర్వీఎస్ అనిల్ తెరెకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ వీడియో విడుదల చేశారు మేకర్స్.ఈ వీడియోలో బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్, కమెడియన్ వెన్నెల కిషోర్ కనిపించారు.
ముందుగా బ్రహ్మానందం తన కొడుకు గౌతమ్‌ను ఉద్దేశిస్తూ.. పుష్కరం అయింది వాడు సినిమా చేసి. నువైనా చెప్పుచ్చుకదారా వాడితో. ప్రతిస్టోరీ వింటాడు. డెప్త్ లేదు, కాన్సెప్ట్ లేదని ఏదేదో చెబుతుంటాడు. అని వెన్నెల కిషోర్ తో అంటాడు. దానికి సమాధానంగా వెన్నెల కిషోర్.. అవన్నీ ఉన్న కథ సెట్ అయిందట .. అంటాడు. దానికి బ్రహ్మానంద అవునా అనగానే.. అక్కడికి గౌతమ్ వచ్చి ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. దానికి బ్రహ్మానందం.. ఏమైంది ఏంటి ప్రాబ్లమ్ చెప్పు అంటాడు.. ఈ సినిమాలో నువ్వు తాతగా చేయాలి అంటాడు గౌతమ్. అలా చాలా సరదాగా సాగిన ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ వీడేమో సోషల్ విూడియాలో వైరల్ గా మారింది.
ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నఈ సినిమా గురించి త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఈ ఇయర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. మరి సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.