08-05-2024 RJ
సినీ స్క్రీన్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన వివాహానికి సంబంధించి నెటిజన్ పెట్టిన పోస్ట్‌ను ఖండించారు . దీంతో మరోసారి ఆమె పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది.’జాన్వీ కపూర్ పెళ్లి తిరుపతిలో జరుగనుంది. బంగారు రంగు శారీ కట్టుకోనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు’ అని ఇన్‌స్టాలో ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. దీనికి ఆమె రియాక్ట్ అయ్యారు. ’ఏదైనా రాస్తారా..’ అని రిప్లై ఇచ్చారు. ఇక ఈ పోస్ట్‌కు అభిమానులు కూడా సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ’విూకు కూడా తెలియకుండా విూ పెళ్లి చేసేస్తున్నారు’ అని ఒకరు అనగా.. ’విూరు పెళ్లి చేసుకునే వరకు వీళ్లు ప్రశాంతంగా ఉండేలా లేరు’ అంటూ కామెంట్ చేశారు.
కొంతకాలంగా జాన్వీ ప్రేమ వ్యవహారం సోషల్ విూడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ’కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ తన ఫోన్‌లో స్పీడ్ డయల్ లిస్ట్ నంబర్లను ప్రస్తావిస్తూ.. తన తండ్రి, చెల్లి, శిఖర్ పేర్లు చెప్పారు. దీంతో ఈ రూమర్స్‌కు బలం చేకూరింది. అలాగే ’మైదాన్’ సినిమా ప్రీమియర్ షోలో ఆమె ’శిఖు’ (శిఖర్ పహాడియా) అనే లోగో ఉన్న నెక్లెస్ వేసుకువచ్చారు.
ఆ ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో వీళ్లిద్దరిపై బాలీవుడ్ విూడియాలో పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమాల విషయానికొస్తే.. ’దేవర’తో జాన్వీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్ డ్రామాఇది. అక్టోబర్ 10న మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు రామ్ చరణ్`బుచ్చిబాబుల కాంబోలో రానున్న సినిమాలోనూ జాన్వీ నటిస్తున్నారు. త్వరలోనే దీని షూటింగ్ మొదలుకానుంది