09-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విరుచుకుపడ్డారు. 25 లక్షల మందిని దారిద్యరేఖకు దిగువన ఉన్న వాళ్ళను పైకి తీసుకువచ్చామని మోదీ అంటున్నారని.. అదే నిజం అయితే ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నట్లని ప్రశ్నించారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పుకోవడంలో విఫలం అవుతున్నామని చెప్పు కొచ్చారు. మోదీ పదేళ్లలో ఏం చేశారో చెప్పడానికి ఏం లేదన్నారు. మరోసారి మోదీ వస్తే.. అదానీ అంబానీలను కోటీశ్వరులు చేస్తారు తప్ప పేదలకు ఏం చేయరని విమర్శించారు.
రాహుల్ గాంధీ కుల గణన చేపడతామని అంటున్నారని.. ఓబీసీని సపరేట్ చేసింది రాహుల్ గాంధి అని అన్నారు. దేశం సమిష్టిగా ఉండాలి అంటే కాంగ్రెస్ రావాలని అన్నారు. స్వతంత్యర్ర తెచ్చింది మహాత్మా గాంధీ అని.. బీజేపీ విూడియా పబ్లిసిటీ అసత్య ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి హావిూ పథకం వేతనం రూ.400 తప్పక చేస్తామని వి. హనుమంతరావు స్పష్టం చేశారు.