09-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం, మే 8: భీమిలి నియోజకవర్గం మేనిఫెస్టోను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎట్టి పరిస్థితిలో మళ్లీ అధికారంలోకి రాకూడదని కూటమి పనిచేస్తుందన్నారు. వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. జూన్ 4న జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారని అన్నారు. వైసీపీ పార్టీ మానిఫెస్టోలో దేనికి పొంతన లేదని... పాత మేనిఫెస్టోని కొనసాగిస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఇప్పుడు తాము పొత్తు పెట్టుకున్నామని వివరించారు. గత ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి, నవరత్నాల అమలు చేస్తామని మోసం చేశారన్నారు. జగన్ నిక్కర్లు వేసుకోక ముందు నుంచి రాష్ట్రంలో టీడీపీ సంక్షేమం చేస్తోందన్నారు. భీమిలి అభివృద్ధి... ప్రత్యేక ప్రణాళికలు, సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. హౌసింగ్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈసీని మోదీ మేనేజ్ చేస్తున్నారని అంటూ చెబుతున్న మాట.. బొత్స మాటనా?... లేక పార్టీ మాటనా? చెప్పాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.