ad1
ad1
Card image cap
Tags  

  09-05-2024       RJ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ జరగాలి: బివి రాఘవులు

ఆంధ్రప్రదేశ్

విశాఖపట్టణం, మే 9: ఎన్నికల్లో గాజువాక సిపిఎం అభ్యర్థి ఎం జగ్గునాయుడు, విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి, పశ్చిమంలో సిపిఐ అభ్యర్థి విమల, విశాఖపట్నం పార్లమెంట్‌ పరిధిలోని కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తేనే స్టీల్ ప్లాంట్ కు రక్షణ, ప్రజా కార్మిక పోరాటాలకు బలం అని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఉద్ఘాటించారు . స్టీల్‌ ప్లాంట్‌ గేట్‌ బిసి చెరువు స్టీల్‌ ప్లాంట్‌ వద్ద గురువారం ఉదయం ఇండియా బ్లాక్‌ సిపిఎం ఆమ్‌ ఆద్మీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన సభకు అయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసింగించారు. ఈ రోజున ఏకకాలంలో జరుగుతున్న పార్లమెంట్‌, శాసనసభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. ఎన్నికల్లో మూడు పక్షాలు పోటీల్లో నిలిచాయన్నారు. మొదటిది అధికారపక్షమైన వైసిపి, మరొకటి కేంద్ర అధికార పక్షమైన బిజెపి. బిజెపితో కూడిన టిడిపి జనసేన, మూడోది ఇండియా కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఉన్నాయన్నారు. ఇందులో ఎవరిని గెలిపించుకుంటే దేశానికి, రాష్టాన్రికి అదేవిధంగా స్టీల్‌ ప్లాంట్‌ కూడా మేలు జరుగుతుందో ప్రజల నిర్ణయించాలన్నారు.

నిజానికి మూడు పార్టీలు మూడు పక్షాలు ఉన్న అందులో రెండు పక్షాలకు చెందిన వైసిపి టిడిపి జనసేన బిజెపి ఒకటే వైఖరి వీరు రాష్టాన్రికి ద్రోహం చేసేందుకే రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈరోజు దేశానికి రాష్టాన్రికి మేలు చేసేలా స్టీల్‌ ప్లాంటుకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని చూపిస్తుంది కేవలం ఇండియా కూటమి మాత్రమేనని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం టిడిపి ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో మోడీ ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు టిడిపి ప్రభుత్వం చేయలేదని ప్రశ్నించారు. అనంతరం మరో 5 ఏళ్ళు వైసిపి అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రం  స్టీల్‌ ప్లాంటును అమ్మేస్తామంటుంటే కార్మికులు కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటాలకు ఎటువంటి మద్దతు ఇవ్వకుండా, ఎటువంటి చర్యలు చేపట్టకుండా లోపాయి  కారీగా బీజేపీకి వత్తాసు పలికిందన్నారు. మొన్న గాజువాక సభలో జగన్మోహన్‌ రెడ్డి స్టీల్‌ ప్లాంట్ పై మాట్లాడిన మాటలు ఖండిస్తున్నట్లు తెలిపారు. ‘ఆదానిని రాష్టాన్రికి రప్పించి అతనికి గంగవరం పోర్ట్‌ అప్పజెప్పి తద్వారా స్టీల్‌ ప్లాంట్ ను కబళించేందుకు కుట్ర పన్నింది నువ్వు కాదా అని జగన్‌ మోహన్‌ రెడ్డి‘ అని ప్రశ్నించారు. ఈరోజు వరకు స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నామంటే ఈ కార్మికుల ఐక్యత వారి పోరాటాల వల్లే సాధ్యమైంది తప్ప దీనిలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏవిూ లేదన్నారు.

ప్రభుత్వానికి కనీసం కార్మికుల నిరసనలకు సంఫీుభావం తెలిపే తీరిక కూడా లేదన్నారు. అఖిల భారత స్థాయిలో దేశంలోని ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు మనకు అండదండలుగా నిలిచి స్టీల్‌ ప్లాంట్ కాపాడుకునేందుకు సహకరిస్తున్నాయి. రాబోయే కాలంలో ఎన్నికలు స్టీల్‌ ప్లాంట్ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని తెలిపారు అలాగే జనసేన, బిజెపి గెలిస్తే మనం  స్వచ్ఛందంగా ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుందన్నారు. స్టీల్‌ ప్లాంట్ కు మనమే గొయ్యి తీసి భూస్థాపితం చేసినట్టు అవుతుందని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు అంతా కలిసి నేడు స్టీల్‌ ప్లాంట్‌ను బతికించాలి, ఆంధ్రప్రదేశ్‌  ఆత్మ గౌరవాన్ని బతికించాలన్నారు. అది జరగాలంటే ఇటు బిజెపి కూటమి గానీ అటు వైసిపి కానీ ఎన్నికల్లో గెలవకూడదన్నారు. నేడు జనసేన, టిడిపి, వైసిపి పార్టీలు బిజెపి పంచన చేరాయన్నారు. ఇక్కడ ఎవరు గెలిచినా పెద్దగా వ్యత్యాసం ఏవిూ ఉండదని.. స్టీల్‌ ప్లాంట్‌ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలి అంటే ఇక్కడ సిపిఎం అభ్యర్థి జగ్గు నాయుడు గెలవాలి, అలాగే పార్లమెంట్‌ అభ్యర్థి సత్య రెడ్డి గెలవాలి అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు మనకు అవకాశం ఉంటుందన్నారు. స్టీల్‌ ప్లాంట్ కార్మికులంతా జగ్గు నాయుడుకు, సత్యరెడ్డికి ఓటు వేస్తే ప్రాణాలు ఇచ్చి  స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుకుంటామన్నారు. అది మాత్రమే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న సిపిఐ, కాంగ్రెస్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే మరింత బలం చేయకూరుతుందని తద్వారా పోరాటాలను 
మరింత ఉధృతం  చేసేందుకు అవకాశం ఉందన్నారు.

ఈ సభకు ముందు జింక్‌ గేట్‌ వద్ద భారీ బైక్‌ ర్యాలీ గాజువాక పురవీధులు, పట్టణం లోని పలు వార్డుల్లో సాగింది? బైక్‌ ర్యాలీ లో వందల సంఖ్యలో సిపిఎం శ్రేణులు స్టీల్‌ ప్లాంట్ కార్మికులు పాల్గొన్నారు. సభా వేదికపై సిపిఎం రాష్ట్ర నాయకులు సి హెచ్‌ నరసింగరావు ప్రసంగించారు.గాజువాకలో సిపిఎం, ఇండియా బ్లాక్‌ ఆధ్వర్యంలో గురువారం ఉదయం భారీ బైక్‌ ర్యాలీ ప్రారంభం అయింది. గాజువాక సిపిఎం అభ్యర్థి జగ్గునాయుడు, విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డిని గెలిపించాలని కోరుతూ గాజువాక నియోజకవర్గం అంతటా వీధి వీధినా వందలాది బైక్‌లతో సిపిఎం నాయకులు ర్యాలీ చేపట్టారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP