09-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, మే 9: ఆంధప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున మద్యం, నగదు స్వాధీనం అవుతున్న విషయం తెలసిందే. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమ రవాణా మద్యం తరలించినట్లు సమాచారం అందడంతో నందిగామ పట్టణ శివారు డివిఆర్ కాలనీ వద్ద గురువారంతెల్లవారుజామున అక్రమంగా రవాణా చేస్తున్న మూడు వేల గోవా మద్యం సీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మద్యం విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని సమాచారం. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆటోని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాపు చేసున్నటు పోలీసులు తెలిపారు.