09-05-2024 RJ
సినీ స్క్రీన్
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే హీరో హీరోయిన్ల లిప్‌లాక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ.. ఎమోషన్స్‌తో మిమ్మల్ని షాక్‌కు గురి చేసే ఇంటెన్స్ టేల్ త్వరలో విూ ముందుకు రాబోతుందంటూ షేర్ చేయగా ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. విశ్వక్‌సేన్ ఈ చిత్రంలో లంకల రత్నగా కనిపించబోతున్నట్టు చేతిలో కత్తిపట్టుకున్న బ్యాక్ లుక్ స్టిల్ ద్వారా తెలియజేశారు మేకర్స్. ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన సుట్టంలా సూసి పోకలా సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. తాజాగా బ్యాడ్ సాంగ్ అప్‌డేట్ అందించారు.
మాస్ కా దాస్ కత్తి చేతపట్టుకొని శత్రువులను చీల్చి చెండాతున్నట్టుగా ఉన్న పోస్టర్.. సాంగ్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉండబోతుందని చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌తో హైప్ పెంచేస్తున్నారు. ఈ మూవీలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.