09-05-2024 RJ
సినీ స్క్రీన్
సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న కథానాయిక... సాయిపల్లవి. ’తండేల్’లో బుజ్జితల్లిగా సందడి చేయనుంది. కథానాయకుడు నాగచైతన్య జాలరి పాత్రలో కనిపిస్తే... సాయిపల్లవి ఆయనతో కలిసి అల్లరి చేయనుంది. గురువారం సాయిపల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా బుధవారం ’తండేల్’లోని ఆమె లుక్‌ని విడుదల చేశారు. సాగర తీరాన కూర్చుని నవ్వుతూ ఫోన్‌లో మాట్లాడుతున్న ఆ లుక్ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోంది.
గురువారం సాయిపల్లవి పుట్టినరోజు ప్రత్యేకంగా ఓ వీడియోని విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రమిది. బన్నీ వాస్ నిర్మాత. అల్లు అరవింద్ సమర్పకులు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.