ad1
ad1
Card image cap
Tags  

  10-05-2024       RJ

ఎన్నికలు ముగిసాకే సంక్షేమ పథకాలకు నగదు విడుదల చేయాలి: ఈసి

ఆంధ్రప్రదేశ్

విజయవాడ,మే 9: రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బుల జమపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు పూర్తైన  తర్వాతే డబ్బులను లబ్దిదారులకు జమ చేయాలని స్పష్టం చేసింది. మే 13న పోలింగ్‌ తర్వాత డబ్బులు జమ చేసేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపింది. ఎన్నికల కోడ్‌ కంటే ముందుగానే పలు పథకాలకు సీఎం జగన్‌ బటన్‌ నొక్కారని ఈసీ పేర్కొంది. దీనిపై ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయగా.. ఆ వినతిని తిరస్కరించింది.సంక్షేమ పథకాల నగదు డీబీటీతో వెంటనే లబ్దిదారుల ఖాతాలకు చేరుతున్నా నిధుల జమ ఎందుకు ఆలస్యమైంది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రచారం ముగిశాక జమ చేసే యత్నం జరుగుతోంది. పోలింగ్‌ కు 2 రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తే అది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే అవుతుంది. ఎన్నికలు పూర్తయ్యాకే ఆ నిధులు జమ చేయాలి.’ అని ఈసీ తెలిపింది.

డబ్బులకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి ఈసీ లేఖ రాసింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందే బటన్‌ నొక్కి వివిధ పథకాలకు నిధులు విడుదల చేశారన్న ఈసీ.. 2 రోజుల్లో లబ్దిదారుల ఖాతాలకు వెళ్లాల్సిన నిధులు ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో చేరలేదని పేర్కొంది. ఈ జాప్యంపై వివరణతో కూడిన నివేదికను ఈ నెల 10లోపు ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో మొత్తం 6 పథకాలకు సంబంధించి సీఎం జగన్‌ ఎప్పుడెప్పుడు బటన్‌ నొక్కారనే విషయంపై లేఖలో ప్రస్తావించిన ఈసీ.. మొత్తంగా రూ.14,165 కోట్లకు సంబంధించి నిధులు విడుదలకు బటన్‌ నొక్కారని తెలిపింది. అయితే, ప్రచారం పూర్తయిన తర్వాత పోలింగ్‌ కు ముందు 11, 12 తేదీల్లో నిధుల విడుదలయ్యేలా చూశారన్న సమాచారం తమకు ఉందని లేఖలో వెల్లడిరచింది. ఈసీ తాజా ఆదేశాలతో పోలింగ్‌ తర్వాతే  లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. మరోవైపు, నగదు జమ చేయకుండా.. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలు సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ సాగింది.

వైఎస్సార్‌ ఆసరా, జగనన్న చేయూత లబ్దిదారులకు నగదు జమ చేయకుండా ఈసీ ఆదేశాలు ఇచ్చినట్లు పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, దీనిపై స్పందించిన ఈసీ పోలింగ్‌ తేదీ తర్వాతే నగదు లబ్దిదారుల ఖాతాకు జమ చేయాలని కోర్టుకు తెలిపింది. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు వైసీపీ అధినేత జగన్‌ చేస్తున్న  ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్‌ పెట్టింది. సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్‌కు 2 రోజుల ముందు డబ్బులు పంపిణీ చేయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టింది. సంక్షేమ పథకాల సొమ్ముల చెల్లింపునకు కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పింది. పథకాలకు ఎన్నికలు ముగిసే వరకు నిధులు విడుదల చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సర్క్యూలర్‌ జారీ చేసింది.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP