10-05-2024 RJ
తెలంగాణ
వర్షాలు వచ్చాయంటే చాలు ఈ మ్యాన్ హోల్స్ లో పడి ఎంతో మంది సామాన్యులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు, మనిషి చనిపోయిన తర్వాత అతని కుటుంబానికి ఎక్స్ గ్రేషియా రూపంలో డబ్బు ఇచ్చి ఏమి ఉపయోగం, ఒక్క మ్యాన్ హోల్ దగ్గర కూడా సైన్ బోర్డు ఉండదు, ఎవరో ఒకరు చనిపోయిన తర్వాత బోర్డు వస్తుంది. అధికారుల నిర్లక్ష్యానికి ఒక ప్రాణం బలి అయితే కానీ నిద్రలేవరు, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా ఇబ్బందులు పడాలి, ఇలా అవస్థలు పడాలి, పైన పటారం లోన లొటారం లాగ చెప్పుకుంటూ ఇంకా ఎన్నాళ్ళు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు ఇలా ఎన్నాళ్ళు పై పైన మరమత్తులు చేస్తూ ఉంటారు.
దీనికి పూర్తి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది, ఇలా వర్షాలు పడినపుడల్లా ఎవరో ఒకరు చనిపోతూనే ఉండాలా.. ఇప్పటికైనా అధికారులు, నాయకులు కళ్ళు తెరిచి, గ్రౌండ్ లెవెల్ నుంచి డ్రైనేజీ వ్యవస్థని మెరుగు పరిచి, వర్షం పడితే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, మాన్ హోల్, గుంతలు భయాలు లేకుండా మేము క్షేమంగా ఇళ్లకు వెళ్లగలము అని ప్రజలు అనుకునేలా ఎప్పుడు చేసి చూపించగలురు..
ఇది సామాన్యుడి ప్రశ్న?
సామాన్యుడి గురించి ఆలోచించండి, ఇది ప్రజల ప్రాణాలకి సంబందించినది. ఇప్పటికే నిర్లక్ష్యం వలన ఎన్నో ప్రాణాలు పోయాయి. ఒక సాధారణమైన సామాన్యుడి బాధ ఇది, ఇకనైనా పట్టించుకుని దీన్ని పరిష్కరిస్తారని ఆశిస్తూ.. సామాన్యుడు
అధికారుల్లారా..! ఇకనైనా స్పందించండి ! ముందుగానే చర్య తీసుకోండి