11-05-2024 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్నవదనం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సరికొత్త కథా, కథనాలతో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మరో వినూత్న కథతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు సుహాస్. అదే గొర్రె పురాణం. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. వినూత్న కథతో వస్తున్న ఈ టీజర్ చాలా కొత్తగా ఉంది.
ఇప్పుడొక విూకొక బ్రేకింగ్ న్యూస్.. ఒక గ్రామంలో రెండు వర్గాల మధ్య ఒక గొర్రె చిచ్చు పెట్టింది. అనే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయ్యింది ఈ టీజర్. తరువాత.. ఆ గొర్రె మాది అంటే మాది అని అంటూ హిందూ, ముస్లింలు వాదించుకుంటారు. అలా చిన్నగా మొదలైన గొడవ గ్రామ సమస్యగా మారుతుంది. ఇక సుహాస్ జైల్లో ఖైదీలా కనిపించారు. మరి సుహాస్ కి ఆ గొర్రె పిల్లకి ఏమైనా సంబంధం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ టీజర్ తో సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మరి మరో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్నీస్ సాధిస్తుందో చూడాలి.