12-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 12: ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసిపోయింది. కొద్ది నెలలుగా ప్రచారంలో రోజుకు పలు ప్రాంతాలు తిరుగుతూ క్షణం తీరిక లేకుండా గడిపిన రాజకీయ నాయకులు కాస్త ఊరట పొందుతున్నారు. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూవర్సిటీలో సరదాగా ఫుట్ బాల్ ఆడారు. ఆట మధ్యలో షూ పాడైపోతే షూ లేకుండనే సీఎం ఫుట్ బాల్ ఆడారు.
సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హెచ్‌సీయూ విద్యార్థులు తదితరులు సీఎంతో పాటు ఫుట్ బాల్ ఆడారు. ఈ ఫుట్ బాల్ మ్యాచ్ కి సీఎం సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏం ఏ ఫహీం, టీ శాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి ఇతరులు కూడా హాజరయ్యారు.