12-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 12: ఎన్నికల నేపథ్యంలో నగరవాసులు సొంతూర్లకు పయణమయ్యారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఆదివారం ఉదయం నుంచే రద్దీ కొనసాగింది. బస్సులతోపాటు సొంత వాహనాల్లో ఓటర్లు తరలివెళ్తుండటంతో ఎల్బీనగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీనగర్ నుంచి పనామా వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.ఏపీతోపాటు ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట వైపు భారీగా ప్రజలు తమ సొంతూర్లకు తరలి వెళ్తున్నారు. దీంతో విజయవాడ హైవేపై పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ఇక చౌటుప్పల్ సవిూపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో చౌటుప్పల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.