12-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 12: కొందరు కొత్త తరహా రాజకీయ మోసాలకు తెరలేపారు. డబ్బులు ఇచ్చి ఓటేయకుండా ముందే వేలుపై సిరా గుర్తు పెట్టిస్తున్నారన్న ప్రచారం ఎపి రాజకీయాల్లో కలకలం రేపింది.దీనిపై ఫిర్యాదులు కూడా అందాయి. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్ విూనా హెచ్చరించారు. ఓటర్ల వేళ్లపై చెరగని సిరాతో మార్కు చేస్తున్నట్లు సోషల్ విూడియాలో ప్రచారం జరుగుతోందని.. అలా చేయడం సరికాదన్నారు. భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే చెరగని సిరా ఉంటుందని అన్నారు.
ఒకవేళ ఇతర సిరాలతో ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల వేళ ఎవరు నిబంధనలు ఉల్లంఘించిన ఏమాత్రం సహించబోము అని గట్టి హెచ్చరిక చేశారు. ఎన్నికల సిరాపై సోషల్ విూడియాలో వస్తున్న వదంతులపై సీఈఓ ముఖేష్ కుమార్ విూనా స్పష్టత ఇచ్చారు. ఎలక్షన్ ఇంక్ భారత ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉంటుందని.. ఇతరుల దగ్గర ఉండే ప్రసక్తే లేదని చెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉండటంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ఏదైనా సమస్య వస్తే అదనంగా ఇవిఎంలు రెడీగా ఉన్నాయని ముఖేష్ కుమార్ విూనా చెప్పారు.
వాస్తవానికి ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటరు వేలిపై సిరా వేస్తారు. దొంగ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఒకసారి ఓటు వేసిన ఓటరు మరోసారి ఓటు వేయకుండా ఉండేందుకు సిరా మార్క్ వేస్తారు. అయితే, కొంతమంది ఓటర్ల వేళ్లపై ఇంటి దగ్గరే సిరా ముందుగానే మార్క్ చేసి ఓటు వేయకుండా చేస్తున్నారంటూ సోషల్ విూడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.. ఈ విషయం ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో ఎన్నికల సంఘం స్పందించింది.. అలాంటి సిరా ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉంటుందని.. వేరే వ్యక్తుల దగ్గర ఉండదని ముఖేష్ విూనా తెలిపారు.
అలాంటి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలాఉంటే.. ఏపీలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.. ఇప్పటికే.. ఈవీఎంలు, వీవీ ప్యాట్ ల పంపిణీ పక్రియ కొనసాగుతోంది. సాయంత్రం నాటికి సిబ్బంది.. కేంద్రాలకు చేరుకోనున్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భారీగా బందోబస్తుతో నిర్వహిస్తున్నారు.