12-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 12: తెలంగాణలో సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్తా తెలిపారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినిగించుకోవాలి డీజీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ విూడియా కోసం ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేశాం. రాష్ట్ర సరిహద్దుల్లో పారామెలిటీ బలగాలతో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు.
అలాగే ఎన్నికల్లో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేశామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరాలను వెల్లడిరచారు. అలాగే 7వేల మంది ఇతర రాష్టాల్ర హోంగార్డులతో బందోబస్తు నిర్వహి స్తున్నా మని, 89 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్‌పోస్టులు, 173 అంతర్ జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రూ.186కోట్ల విలువ చేసే మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని, తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు నమోదు చేశామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కేంద్ర బలాలతో భద్రత ఏర్పాటు చేసామని అన్నారు.