12-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 12: ప్రధాని మోదీ మే 14న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మోదీ ఆహ్వానం పంపించారు. ఈ క్రమంలోచంద్రబాబు మంగళవారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్తారు. మోదీ నామినేషన్ సమర్పణ కార్యక్రమ అనంతరం ఎన్డీఏ పక్షాలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాబు మాట్లాడతారు. అనంతరం అదే రోజు సాయంత్రం విజయవాడకు చేరుకుంటారు.