12-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 12: రెండు తెలుగు రాష్టాల్ల్రో ఎన్నికల సందడి నెలకొంది. సోమవారం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉండవల్లిలో నేటి ఉదయం 7.00 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓటు వేయనున్నారు. ఉండవల్లిలోని గాదె రామయ్య సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే పోలింగ్ నేపథ్యంలో ఆయా కేంద్రాల చుట్టుపక్కల పరిసరా ప్రాంతాల్లో ఎన్నికల సంఘం పట్టిష్ట భద్రత చర్యలు చేపట్టింది.
ఏపీలో ఏలాంటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రత చర్యలు చేపట్టారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు నిరంతరం ఎన్నికల సరళి పకడ్బందీగా జరిగేలా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి తెలుగు రాష్టాల్రతోపాటు దేశంలోని 96 ఎంపీ స్థానాల కోసం పోలింగ్ జరుగనుంది.