ad1
ad1
Card image cap
Tags  

  13-05-2024       RJ

ప్రశాంతంగా తెలంగాణలో పోలింగ్‌.. మధ్యాహ్నం వరకు 40.13 శాతం నమోదు

తెలంగాణ

  • కొడంగల్‌లో ఓటేసిన సిఎం రేవంత్‌ రెడ్డి
  • రామ్‌నగర్‌లో గవర్నర్‌ దత్తాత్రేయ దంపతుల ఓటు
  • చింతమడకలో ఓటేసిన కెసిఆర్‌ దంపతులు
  • ఓటేసిన మంత్రులు, ఎమమెల్యేలు, అభ్యర్థులు, సినీ ప్రముఖులు

హైదరాబాద్‌, మే 13: తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.13 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడిరచారు. ఉదయం వాతవారణం కొంత ప్రశాంతంగా చల్లగా ఉండడంతో ఓటర్లు వెంటనే బయటకు వచ్చి ఓటేశారు. ప్రముఖులంతా ముందే వచ్చి ఓటేశారు. చింతమడకలో కెసిఆర్‌, రామ్‌నగర్‌లో దత్తాత్రేయ, జూబ్లీహిల్స్‌లో సినీ ప్రముఖులు, కొడంగల్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి, ఆయా ప్రాంతాల్లో మంత్రులు, అభ్యర్థులు ఓటేశారు. ప్రజలు కూడా గతంతో పోలిస్తే కొంత ఆసక్తిగా ముందుకు వచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. మంత్రులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నల్లొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు అనేది సామాన్యుల స్వరమని.. పాలకులని ప్రశ్నించేందుకు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని నేతలు సూచించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే మతతత్వానికో, ప్రాంతీయతత్వానికో, కులతత్వానికో, ఇతరాత్ర ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.  

కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డిపై సీఈవో వికాస్‌ రాజ్‌కు కాంగ్రెస్‌ పార్టీ (ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన అనంతరం విూడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పేరును ప్రస్తావించడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం తెలిపింది. పోలింగ్‌ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. కిషన్‌ రెడ్డిపై ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ఈసీని కాంగ్రెస్‌ కోరింది. కాగా సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ పక్రియ ప్రశాంతంగా జరుగుతోంది.ఉదయం పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచే పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. ఎండలు, వర్షం భయం కారణంగా.. త్వరగా ఓటేస్తే మంచిదని అభిప్రాయపడుతున్న జనాలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పరిధిలో మెగాస్టార్‌ చిరంజీవి, అల్లూ అర్జున్‌, ఎన్టీఆర్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, ఇతర ప్రముఖులంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్‌, అల్లూ అర్జున్‌, చిరంజీవి దంపతులు, డైరెక్టర్‌ తేజ ఇతర ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రాని చేరుకుని ఓటు వేశారు. ఇకపోతే ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 50.18 శాతం, నాగర్‌కర్నూల్‌ పరిధిలో 45.88 శాతం, జహీరాబాద్‌ పరిధిలో 50.71 శాతం, భువనగిరిలో 46.49, చేవెళ్లలో 34.56 శాతం, హైదరాబాద్‌లో 19.37 శాతం, కరీంనగర్‌లో 45.11 శాతం, ఖమ్మంలో 50.63 శాతం, మహబూబాబాద్‌లో 48.51, మహబూబ్‌నగర్‌లో 45.84 శాతం, మెదక్‌లో 46.72 శాతం, మల్కాజ్‌గిరి పరిధిలో 27.69 శాతం, నల్లగొండలో 48.48 శాతం, నిజామాబాద్‌లో 45.67 శాతం, పెద్దపల్లిలో 44.87 శాతం, సికింద్రాబాద్‌లో 24.91, వరంగల్‌ పరిధిలో 41.62 శాతం పోలింగ్‌ నమోదైంది.

హైదరాబాద్‌లో 20 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సీఈవో వికాస్‌ రాజ్‌ ఉదయం 9గంటల ప్రాంతంలో తెలిపారు. ఓటర్‌ స్లిప్పులు పరిశీలించడం కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు చేశామని.. సీఎం రేవంత్‌ పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతుందని.. ఒంటిగంట వరకూ రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో 50 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు చెప్పారు. హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో మహిళల బురఖా తొలిగించి పరిశీలించడంపై అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. జనగామలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

యువజన కాంగ్రెస్‌ నేత ప్రశాంత్‌ రెడ్డి పోలింగ్‌ సరళి చూసేందుకు రాగా.. బీఆర్‌ఎస్‌ ఏజెంట్‌ అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే పల్లా రజాఏశ్వర రెడ్డి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.తెలంగాణలో పోలింగ్‌ పక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని రామ్‌ నగర్‌ లో ఉన్న జీవి హైస్కూల్‌ పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 234 లో తమ ఓటు వేశారు. 

అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ, ఇక్కడకు వచ్చి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యమని, ఓటుతో మార్పు తేవచ్చని అన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూర్చాలని కోరారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP