13-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 13: నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత తన నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటింగ్ సరళని పరిశీలించారు. బూత్‌లో కూర్చున్న ముస్లిం ఓటర్ల బురఖాలను తొలగించమని కోరి ఓటర్ ఐడీల వెరిఫికేషన్ చేశారు. అజాంపూర్ లోని పోలింగ్ బూత్ నెంబర్ 122లో ఈ వెరిఫికేషన్ చేశారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు నమోదైంది. ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఆదేశాలతో మలక్‌పేట్ పీఎస్‌లో పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
ఓటర్ల స్లిప్‌లను పరిశీలించారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. మాధవీలత ఓటర్ ఐడీలు, స్లిప్‌లను పరిశీలిస్తూ ఓటర్లను తనిఖీ చేస్తున్న వీడియో వెలుగుచూసింది. ఓటర్ల ముఖాలను చూసి, వారిని గుర్తించిన తర్వాత ఓటింగ్‌కు అనుమతించాలని ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగారు.ఓటర్ స్లిప్‌ల తనిఖీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ అన్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణలో 40 శాతం పైగా పోలింగ్ నమోదైందని వెల్లడిరచారు. కొన్ని ప్రాంతాల్లో 50 శాతం పోలింగ్ నమోదైందని తెలంగాణ వికాస్ రాజ్ పేర్కొన్నారు.