13-05-2024 RJ
సినీ స్క్రీన్
’హనుమాన్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్‌వర్మ. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రణ్‌వీర్‌సింగ్‌తో ప్రశాంత్‌వర్మ ఓ సినిమా చేయబోతున్నాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ ఏడాదే సెట్స్‌విూదకు వెళ్లనుందని తెలుస్తోంది.
ఈ చిత్రానికి ’బ్రహ్మరాక్షస’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, అన్ని భాషల్లో అదే టైటిల్ ఉంటుందని అంటున్నారు. ’హనుమాన్’ సినిమా తరహాలోనే సూపర్‌హీరో కథాంశంతో ’బ్రహ్మరాక్షస’ తెరకెక్కనుందని, భారీ సాంకేతిక హంగులతో తీయబోతున్నారని బాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది. ప్రస్తుతం ప్రశాంత్‌వర్మ ’జై హనుమాన్’పై దృష్టిపెట్టారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే ’బ్రహ్మరాక్షస’ పట్టాలెక్కనుంది.