13-05-2024 RJ
తెలంగాణ
నాగర్‌కర్నూల్, మే 13: నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అలంపూర్ పట్టణంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలంపూర్ పట్టణంలోని పోలింగ్ బూత్ నంబర్ 272లో ఆర్‌ఎస్పీ ఓటేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. నాకు జన్మనిచ్చిన గడ్డ అలంపూర్‌లో తాను ఓటు హక్కును వినియోగించుకున్నాను. గ్రామాల్లో ఓట్ల పండగ వాతావరణం కనిపిస్తోంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలివస్తున్నారు.
ఇదీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. ఓటు హక్కు నిశ్శబ్ద విప్లవానికి నాంది.ప్రజలే న్యాయ నిర్ణేతలుగా ఇచ్చే ఎన్నికల తీర్పులో? భారత రాజ్యాంగం రక్షించబడాలి, ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లాలి. విూరు కూడా విూ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు వేస్తున్న ప్రతి ఒక్కరికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.