13-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 13: తెలంగాణలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్ రాజ్ వెల్లడిరచారు. శాంతి భద్రతల సమస్య తలెత్తలేదన్నారు. మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా వచ్చారని పేర్కొన్నారు. ఇంకా 13, 14 వందల పోలింగ్ స్టేషన్లో ఇంకా పోలింగ్ నడుస్తోందని తెలిపారు. ఉదయం నుంచి పోలింగ్ మంచిగా జరిగిందన్నారు. తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైందని.. అత్యధికంగా మెదక్‌లో 71.33 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.17 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడిరచారు. కేంద్ర ఆధ్వర్యంలో ఉండే యాప్‌లలో 415 ఫిర్యాదులు రాగా.. వేర్వేరు ప్రాంతాల్లో 38 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. 225 ఫిర్యాదులు సీ విజిల్ యాప్ ద్వారా వచ్చాయన్నారు.
భారీ బందోబస్తుతో స్ట్రాంగ్‌రూమ్స్‌లో ఈవీఎంలను భద్రపరుస్తామన్నారు. ఈవీఎంలలో సమస్య వస్తే వెంటనే రీప్లేస్ చేశామని.. సాయంత్రం ఐదు గంటలకు వచ్చిన పోలింగ్ శాతం అంచనానే అంటూ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత కచ్చితమైన పోలింగ్ శాతం వస్తుందని.. మంగళవారమే పూర్తి పోలింగ్ శాతం వస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు 330 కోట్లు సీజ్ చేశామన్నారు. 44 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని.. జనరల్ అబ్జర్వర్స్ ఇచ్చే నివేదిక మేరకు ఎక్కడైనా రీపోలింగ్ అవసరమా లేదా నిర్ణయిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల్లో ప్రజల స్వచ్ఛందంగా ఓటు వేయడానికి వచ్చారన్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో భారీ సంఖ్యలో క్యూలైన్లో ఓటర్లు ఉన్నారన్నారు. ఆదివారం మధ్యాహ్నం వర్షం కారణంగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరడానికి కొంత ఆలస్యమైందని తెలిపారు.
వర్షం కురిసినప్పటికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలింగ్ సిబ్బంది సరైన సమయానికి పోలింగ్ను స్టార్ట్ చేశారన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఎక్కడైనా సమస్య ఉంటే 1950కి ఫిర్యాదు చేయాలన్నారు. 70 శాతం పోలింగ్ నమోదవుతుందని ఆశిస్తున్నట్లు సీఈవో వికాస్ రాజ్ పేర్కొన్నారు. కొన్ని చోట్ల వర్షాల వల్ల నిర్మల్,ఆదిలాబాద్,ఆసిఫాబాద్‌లో ఇబ్బందులు వచ్చాయన్నారు. 1`2 శాతం ఈవీఎంలు ఆలస్యంగా వెళ్లాయన్నారు. పరిస్థితి అంతా అదుపులోనే ఉందని తెలిపారు. తెల్లవారుజామున 5:30 గంటలకే మాక్ పోలింగ్ జరిగిందని.. 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయిందని తెలిపారు. లా అండ్ ఆర్డర్ బాగుందన్నారు. ఈవీఎంలు కొన్ని చోట్ల మొరాయించాయన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విూద ఫిర్యాదును చెక్ చేస్తామని సీఈవో వికాస్ రాజ్ వెల్లడిరచారు. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. అతి సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 5 గంటలకు ముగిసింది.
అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. తెలంగాణలో 61.66 శాతం పోలింగ్ నమోదైంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని 5 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్, సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ముగిసింది.