ad1
ad1
Card image cap
Tags  

  13-05-2024       RJ

పల్నాడు జిల్లా తంగెడలో బాంబు దాడులు.. ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు

ఆంధ్రప్రదేశ్

పల్నాడు, మే 13: పల్నాడుజిల్లా గురజాల నియోజకవర్గం మారుమూల ప్రాంతంలో ఉండే తంగెడ గ్రామంలో బాంబుల దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది . వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఒక్క ఓటు విషయంలో జరిగిన వివాదం ఉదయం నుంచి స్వల్ప ఉద్రిక్తలకు దారితీసింది. సాయంత్రం పోలింగ్‌ 6 గంటలకు ముగిసిన తరువాత గ్రామంలో రెండు వర్గాలు పెట్రోలు, నాటు బాంబులతో ఇళ్లపై దాడి చేసుకున్నారు. దీంతో పలు నివాసపు ఇండ్లు,వాహనాలు దగ్దమయ్యాయి. ఈ దాడులో 10 మందికి పైగా తీవ్రగాయాలయినట్లు సమాచారం. ఘటనా విషయం తెలుసుకున్న పోలీసులు అదనపు బలగాలతో గ్రామానికి చేరుకున్నారు.

జిల్లా వ్యాప్తంగా మాచర్ల, గురజాల నియోజకవర్గంలో ఉదయం నుంచే ఘర్షణలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి మండలం మోపిదేవి లంక గ్రామంలో వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు. ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

మరోవైపు.. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజక వర్గంలో కుందిర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల నేతలు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో టీడీపీ అభ్యర్థికి చెందిన వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఇరువర్గాలు కొట్టుకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. నరసరావుపేట మున్సిపల్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరువర్గాల చెందిన వాహనాలను ధ్వంసం చేసుకున్నారు. టీడీపీ, వైసీపీ నేతల ఇళ్లపైనా రాళ్ల దాడి జరిగింది. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు ఓపెన్‌ చేశారు. అల్లరి మూకలపై రబ్బర్‌ బుల్లెట్లు ప్రయోగించారు. కాగా, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధప్రదేశ్‌లో పలుచోట్ల పలు దుర్ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారం ముఖేష్‌ కుమార్‌ విూనా తీవ్రంగా పరిగణించారు.

ముఖ్యంగా తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధం చేయటంతో.. కేసులు పెట్టాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇక, పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్‌ఐ ని వెంటనే సస్పెండ్‌ చేయాలని సీఈవో ముకేష్‌ కుమార్‌ విూనా  ఆదేశించారు. 

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP