13-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
పులివెందులో జగన్ దంపతుల ఓటు
హిందూపురంలో ఓటేసిన బాలకృష్ణ దంపతులు
ఇడుపులపాయలో షర్మిల దంపతుల ఓటు
అమరావతి, మే 13: ఎపిలో పలువురు ప్రముఖులు ఉదయమే ఓటు వేశారు. అమరావతిలో చంద్రబాబు సతీమసమేతంగా ఓటేశారు. అలాగే పులివెందులలో జగన్ దంపతులు ఓటేశారు. ఇడుపులపాయలో షర్మిల ఓటేశారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా ఓటేశారు. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి వసుంధరతో కలిసి ఆయన ఓటు వేశారు. హిందూపురంలోని ఓ పోలింగ్ కేంద్రంలో వారు తమ ఓటును వినియోగించుకున్నారు.
అనంతరం పోలింగ్ కేంద్రం బయట బాలకృష్ణ దంపతులు తమ వేళ్లకు ఉన్న సిరా గుర్తులను చూపించారు. నటుడు బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా ఆయన మరోసారి అక్కడి నుంచే బరిలో నిలిచారు. ఏపీలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దంపతులు సోమవారం ఓటు హక్కును వినియోగింజుకున్నారు. కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల, భర్త అనిల్‌తో కలిసి ఇడుపులపాయ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నాయకులు దౌర్జాన్యాలకు, దాడులకు పాల్పడుతూ ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
రైల్వేకోడూరు లో వైసీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అధికారులు, పోలీసులు నిస్వార్థంగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలసిన బాధ్యత ఉందని కోరారు. బిజెపి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఓటేశారు.