14-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 14: మొక్కజొన్న ధరల పతనంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. నాలుగు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులను అవకాశంగా మలుచుకున్న దళారులు ధరలను తగ్గిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్‌లో పండిన మొక్కజొన్న క్వింటా ధర రూ. 2250 లకు మొదట్లో కొనుగోలు చేశారు. ఆ తరువాత క్రమేణా ధరలను అమాంతం తగ్గించారు. గాలి దూమారం వస్తుండటంతో రైతులు మొక్కజొన్నను కల్లాలో పోగు చేయడం వాటి పై టార్పలిన్ పట్టాలు కప్పుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు.
వ్యాపారులు రైతులలో నెలకొన్న ఆందోళనను ఆసరాగా చేసుకొని తగ్గించి కొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తూకంలో కూడ మోసాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 120 కేజీలకు 2 కేజీల 400 గ్రాములు అదనంగా తరుగు తీయడంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. మొక్కజొన్న అధిక దిగుబడి సాదించినా ధరల తగ్గుదలతో పాటు తరుగు వలన నష్టం జరుగుతుందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.