14-05-2024 RJ
సినీ స్క్రీన్
రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ ’ఇస్మార్ట్’ శంకర్. 2019లో విడుదలైన ఈ చిత్రం అటు పూరి, ఇటు రామ్‌కు ఓ డిఫరెంట్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ మూవీ కొనసాగింపుగా ’డబుల్ ఇస్మార్ట్’ వస్తోంది. మే 15వ తేదీన ఈ మూవీకి సంబంధించి 85 సెకన్ల వీడియోను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో 'డబుల్ ఇస్మార్ట్ రీక్యాప్' అంటూ స్పెషల్ వీడియో పూరి జగన్నాథ్ విడుదల చేశారు. 'ఇస్మార్ట్ శంకర్' మూవీలోని సన్నివేశాలతో పాటు అప్పుడు థియేటర్స్‌లో అభిమానులు చేసిన సందడితో కూడిన సన్నివేశాలను ఇందులో పొందుపరిచారు.