14-05-2024 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ ప్రస్తుతం బడ్డీ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న బడ్డీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్‌తోపాటు గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. రౌడీ గ్యాంగ్ టెడ్డీని చంపేందుకు ప్రయత్నించే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ వీడియో చెబుతోంది. చాలా రోజుల తర్వాత ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఆ పిల్ల కనులే సాంగ్ అప్‌డేట్ అందించారు. ఈ పాటను ఉదయం 10 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. హీరోహీరోయిన్లు ఫోన్‌లో చిట్‌చాట్ చేస్తున్న లుక్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక టెడ్డీ మనుషుల్లా ప్రవర్తించడం.. రౌడీలు టెడ్డీని టార్గెట్ చేయడం.. అల్లు శిరీష్ టెడ్డీని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాడనే అంశాల చుట్టూ సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ క్లారిటీ ఇచ్చేస్తుంది.
ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేళ్ రాజా సమర్పణలో ఆధన జ్ఞానవేళ్ రాజాతో కలిసి నిర్మిస్తున్నారు. బడ్డీలో అజ్మల్ అవిూర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేశ్ కుమార్, మహ్మద్ అలీ, ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బడ్డీకి హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు. అల్లు శిరీష్ ఈ సారి ఎవరూ టచ్ చేయని స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు గ్లింప్స్‌తో అర్థమవుతోంది. అల్లు శిరీష్ చివరగా ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేకపోయింది.