14-05-2024 RJ
సినీ స్క్రీన్
వయసుతో సంబంధంతో లేకుండా యువ హీరోలతో పోటీ పడుతూ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు తలైవా రజినీకాంత్. సెట్స్ విూదున్న సినిమాల్ని త్వరగా పూర్తి చేస్తూ, కొత్త కథల్ని ఆహ్వానిస్తూ మెరుపు వేగం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ’వేట్టయాన్’ ఇప్పటికే ఆయన పార్ట్ చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ విూడియా వేదికగా వెల్లడిరచింది. దర్శకుడు, చిత్రబృందం రజనీకి పుష్పగుచ్ఛం అందిస్తున్న ఫొటోని అందులో పంచుకుంది.
ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా తెలుగు టైటిల్ ఖరారు కాలేదు. ఈ చిత్రం తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ’కూలీ’ చిత్రం కోసం రంగంలోకి దిగుతారు. ఆ తర్వాత ’జైలర్ 2’ పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు.