14-05-2024 RJ
సినీ స్క్రీన్
’కేజీఎఫ్’ చిత్రం పాన్ ఇండియా స్థాయి సక్సెస్ కావడంతో యశ్ క్రేజ్ మామూలుగా పెరగలేదు. పాన్ ఇండియాలో గుర్తింపు పొందిన స్టార్స్‌లో అతను కూడా ఒకడిగా స్థానం సంపాదించుకున్నారు. ఆయన తదుపరి చిత్రం ’టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నయనతార ఓ ప్రధాన పాత్రపోషిస్తునట్లు ఇప్పటికే వార్తలు హల్‌చల్ చేశాయి. ఇప్పుడు ఇందులో మరో పాత్రలో బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషీ ఎంపిక అయినట్లు సమాచారం అందింది.
ఇందులో ఆమె పాత్ర పూర్తిగా యాక్షన్ తరహాలో ఉంటుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో వీఎఫ్‌ఎక్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉందని ఇప్పటికే యాష్ తెలిపారు. దానికోసం యూఎస్‌లోని కొన్ని ప్రముఖ అంతర్జాతీయ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వెర్షన్, ఇంటర్నేషనల్ వెర్షన్‌గా రెండు రూపాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.