14-05-2024 RJ
సినీ స్క్రీన్
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తోన్న హిస్టారికల్ డ్రామా తంగలాన్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథగా అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన తంగలాన్ గ్లింప్స్‌తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మలబార్ సోయగం మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అప్‌డేట్ వచ్చిందని తెలిసిందే.
తాజాగా దీనిపై మరో వార్త వచ్చేసింది. తంగలాన్ జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుండటం దాదాపు ఫైనల్ అయినట్టేనని దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని ఫిలింనగర్ సర్కిల్‌లో ఓ వార్త రౌండప్ చేస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియోను షేర్ చేయగా.. విక్రమ్ తంగలాన్‌లో తన పాత్రకు న్యాయం చేసేందుకు ఎంత ప్రాణం పెట్టి రిస్క్ చేశాడో తెలిసిపోతుంది. ఈ వీడియో చూసిన మూవీ లవర్స్ విక్రమ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తంగలాన్ నుంచి ఇప్పటికే మాళవికా మోహనన్ లుక్ విడుదల చేయగా.. డీగ్లామరైజ్‌డ్‌గా కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.