14-05-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, మే 14: తెలంగాణలో లోక్ సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 శాసనసభా నియోజక వర్గాలలో పోలింగ్ పక్రియ ముగిసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్టాన్రిక్ ఓటింగ్ యంత్రాల లను ఓట్ల లెక్కింపు కేంద్రమైన అదిలాబాద్ జిల్లాలోని మూడు కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లకు తరలించామని సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా అన్నారు.
ఆయా సెగ్మెంట్ల నుంచి తరలించిన ఈవీఎంలను జాగ్రత్తగా సరిచూసుకుని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకనుగుణంగా వాటిని స్ట్రాంగ్ రూమ్ లలో నియోజకవర్గాల వారీగా అమర్చడం జరిగిందన్నారు. మంగళవారం ఉదయం అభ్యర్థుల ఏజెంట్లు, ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం సమక్షంలో సీల్ వేశారు. మంగళవారం ఉదయం 4.00 గంటల ప్రాంతంలో పోలింగ్ అనంతరం రిసెప్షన్ సెంటర్ కు చేరుకున్న ఈవియం లను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్థానిక టిటిడిసి హాల్ లో ఏర్పాటు చేసిన అదిలాబాద్, బోథ్ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్ లకు తరలించిన పిదప శాంతినగర్ లో ఏర్పాటు చేసిన గోదాంను పరిశీలించారు.