15-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్టణం, మే 15: కేంద్ర ప్రభుత్వం రక్షణరంగానికి అవసరమైన 5 ప్లీట్ సపోర్టు నౌకలను సుమారు రూ.20 వేల కోట్లతో నిర్మించడానికి విశాఖలో హిందూస్థాన్ షిప్‌యార్డుకు ఆర్డరు ఇచ్చింది. కానీ హిందూస్థాన్ షిప్‌యార్డు యాజమాన్యం ఇందులో 2 ప్లీట్ సపోర్టు నౌకల నిర్మాణం రాజకీయ ఒత్తిడితో ఎల్ అండ్ టి కి ఇవ్వడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిరచింది. ఈ చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.నరసింగరావు తెలిపారు.
బుధవారం విశాఖ జిల్లా సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రెస్‌విూట్ జరిగింది. ఈ ప్రెస్‌విూట్‌లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కె.ఎం.కుమార్ మంగళం పాల్గన్నారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ?. విశాఖ షిప్‌యార్డుకు పూర్వవైభవం తెచ్చే వర్కు ఆర్డర్లు వచ్చినా వాటిని ప్రైవేట్ ఎల్ అండ్ టి కంపెనీకి నామినేషన్ బేసెస్‌లో అప్పగించడం ప్రమాదకరమన్నారు. దేశంలో విశాఖ షిప్‌యార్డుకు సహజ సిద్ధమైన యార్డు, డ్కెడాక్‌లున్నాయన్నారు. గతంలో 7500 మంది పర్మినెంట్ నైపుణ్య కార్మికులు పనిచేసిన చరిత్ర ఉందని గుర్తు చేశారు.
82 వసంతాలు పూర్తి చేసుకున్న మొట్ట మొదటి నౌక నిర్మాణ సంస్థ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అని? ఇప్పటికి సుమారు 200 పైబడి విభిన్న నౌకల నిర్మాణం చేసిన ఘనత షిప్‌యార్డ్‌కు ఉందని వివరించారు. విశాఖ హిందూస్థాన్ షిప్‌యార్డును బలహీనపరిచే విధంగా చైర్మన్ హేమంత్ ఖత్రీ నిర్ణయాలు చేయడం షిప్‌యార్డు అభివఅద్ధికి ఆటంకం అని నరసింగరావు ఆరోపించారు. క్రితం నెల డిఫెన్స్ సెక్రటరీ శ్రీ గిరిధర్ అరమనే షిప్‌యార్డ్ కు విచ్చేసిన సందర్భంగా ? కార్మికులు 5 ప్లీట్ సపోర్టు నౌకల నిర్మాణం చేపడతామని, ఆర్డర్లు ప్రైవేట్ వారికి ఇవ్వకుండా చైర్మన్‌ను ఆదేశించాలని కోరినా యాజమాన్యం, ప్రభుతం ఎల్ అండ్ టికి 2 నౌకల నిర్మాణం అప్పగించే చర్యలు చేపట్టడం గర్హనీయమన్నారు. వెంటనే ఈ చర్యలు నిలుపుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
అంతే కాకుండా రెండు సంవత్సరాల క్రితమే స్లిప్‌వే మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.5 వేల కోట్లు బ్యాంక్ రుణాలు యాజమాన్యం తీసుకున్నది కానీ, మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా నేటికి చర్యలు తీసుకోలేదు అని చెప్పారు. కానీ, వడ్డీలు మాత్రం ప్రతీనెలా బ్యాంకులకు చెల్లిస్తున్నదన్నారు. కావాలని ఎల్ అండ్ టి కి ఐదు ప్లీట్ల నౌకల నిర్మాణం అప్పగించడానికి సిఎండి కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత 2 సంవత్సరాల నుండి ప్లీట్ సపోర్టు నౌకల నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదో సిఎండి సమాధానం చెప్పాలని నరసింగరావు డిమాండ్ చేశారు.
నౌక నిర్మాణానికి అవసరమైన అన్ని తరగతుల ఉద్యోగులు, కార్మికులు, అధికారులు, టెక్నికల్, నాన్ టెక్నికల్ నియామకం చేపట్టాలని కోరారు. ఈ మధ్య కాలంలో చేపట్టిన అధికారుల నియామక విధానంలో మాజీ నేవీ అధికారుల నియామకంలో మేనేజర్ కేడరు చెప్పి ఎజిఎం, జిఎంల వేతనాలు చెల్లించే పద్ధతి కి స్వస్తి పలకాలని అన్నారు. ఇప్పటి చైర్మన్ హేమంత్ ఖత్రితొ సహా అనేక మంది నిబంధనలకు విరుద్ధంగా గత చైర్మన్ శరత్ బాబు ఆధ్వర్యంలో అధిక మొత్తంలో జీతాలతో జరిగిన నియామకలపై కాగ్ తప్పుపట్టినా నేటికీ అదే విధంగా నియామకాలు జరపడాన్ని సిఐటియుగా ఖండిస్తూన్నామన్నారు.
ఎలాంటి అవినీతికి, ఆశ్రితపక్ష పాతానికి ఆస్కారం లేకుండా నియామకాలు చేపట్టాలని నరసింగరావు డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలలో షిప్‌యార్డ్‌కు వచ్చిన భారీ వర్క్‌ఆర్డర్‌ను షిప్‌యార్డు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నదో సిఎండి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ వర్క్ ఆర్డర్ల ఆధారంగా పూర్వ వైభవానికి పుంజుకునే అవకాశం షిప్‌యార్డుకు వచ్చిందని అన్నారు. సిఎండి తీసుకొనే తప్పుడు నిర్ణయాల వలన షిప్‌యార్డు నాశనం అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎఫ్.ఎస్.ఎస్ 5 షిప్పులను, షిప్‌యార్డులోనే కట్టాలని, ఎల్ అండ్ టి, ఎస్.ఇ.డి.ఎస్ కొచ్చిన్ కు, అలాగే ఫిన్కాంటియరీ సంస్థకు కు ఇచ్చిన ఆర్డర్లు వెనక్కు తీసుకోవాలని నరసింగరావు డిమాండ్ చేశారు.