15-05-2024 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ’దేవర’ఒకటి. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిభాగం 2024 అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా దీనికి సంబంధించి అప్‌డేట్ ఇచ్చింది టీ సిరీస్ సౌత్. ఎన్టీఆర్ పుట్టిన రోజున దేవర సినిమా నుంచి మొదటి పాట వస్తుందని అభిమానులు అంతా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అయితే హోప్స్‌కి మరింత మసాలా యాడ్ చేస్తూ.. తాజాగా సాలిడ్ పోస్ట్ పెట్టింది టీ సిరీస్ సౌత్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా వస్తున్న అంటూ దేవర డైలాగ్‌ను పోస్ట్ చేసింది. దీంతో తారక్ బర్త్ డే రోజు ఫస్ట్ సింగిల్ రానున్నట్లు తెలుస్తుంది. ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు.