15-05-2024 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ . సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో వస్తోన్న ఈ చిత్రాన్ని టాప్ బ్యానర్ వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోంది. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్, గ్లింప్స్ వీడియో, టీజర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్టీగ్రా మారాయి. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని తెలిసిందే. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న సంతోష్ నారాయణన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్ మా సంగీత తాంత్రికుడు సంతోష్ నారాయణన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
అతి త్వరలో ఆయన సంగీత ప్రపంచాన్ని ఆస్వాదించే వరకు వేచి ఉండలేకపోతున్నాం.. అంటూ ట్వీట్ చేశారు మేకర్స్ కల్కి 2898 ఏడీ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేస్తున్నారని తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. బీటౌన్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కమల్ హాసన్, రాజేందప్రసాద్, పశుపతి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్ కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. నాగ్ అశ్విన్ అండ్ ప్రభాస్ టీం రీసెంట్‌గా ఇటలీలోని సర్దినియా ఐలాండ్‌లో ప్రభాస్, దిశాపటానీపై వచ్చే సూపర్ స్టైలిష్ పాటను చిత్రీకరించారని తెలిసిందే.