15-05-2024 RJ
సినీ స్క్రీన్
చాలా రోజులుగా సెట్స్‌పై ఉన్న చిత్రం ’గేమ్ ఛేంజర్’. సినీ ప్రేమికులు... అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడం.. అందులోనూ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అంటే... అందులో భారీ హంగులు ఖాయం. వాటిని పక్కాగా తెరపైకి తీసుకు రావడంలో ఏమాత్రం రాజీపడరు శంకర్. అందుకే ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. కొంతకాలంగా ఈ సినిమాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు రామ్‌చరణ్. శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. తుదిదశకు చేరుకున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు.
ప్రస్తుతం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రామ్‌చరణ్‌తో పాటు, ఇతర తారాగణంపై సన్నివేశాల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో రామ్‌చరణ్ సరసన కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా చిత్రీకరణని పూర్తి చేసి, వచ్చే నెల నుంచి కొత్త సినిమా చిత్రీకరణ కోసం రంగంలోకి దిగనున్నారు రామ్‌చరణ్. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందనున్న ఆ సినిమా ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ’గేమ్‌ఛేంజర్’ పూర్తయిన వెంటనే, కొత్త సినిమాకి తగ్గట్టుగా లుక్ మార్చుకుని, ఆ వెంటనే సెట్‌లోకి అడుగు పెట్టనున్నారు.