15-05-2024 RJ
సినీ స్క్రీన్
వారంలో ఒక్క రోజు మాత్రమే తనలోని కోపాన్ని చూపించే సూర్య అనే యువకుడిగా తెరపై సందడి చేయనున్నాడు... నాని. కోపానికి ఆ ఒక్క రోజే ఎందుకో తెలియాలంటే మాత్రం ’సరిపోదా శనివారం’ చూడాల్సిందే. నాని కథానాయకుడిగా... వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రియాంక మోహన్ కథానాయిక. డి.వి.వి.దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పతాక సన్నివేశాల్ని హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన భారీ సెట్‌లో... నాని, ఇతర తారాగణంపై పోరాట ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి.
నాని మునుపెన్నడూ చేయని సూర్య అనే ఓ శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్నారు. తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ‘ని ఓ ప్రకటనలో స్పష్టం చేశాయి. ఎస్.జె.సూర్య, సాయికుమార్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, ఛాయాగ్రహణం: మురళి.జి, కూర్పు: కార్తీక శ్రీనివాస్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్.