15-05-2024 RJ
సినీ స్క్రీన్
అద్భుతమైన నటన.. ఆకర్షించే అందంతో సినీప్రియుల్ని మెప్పిస్తుంది అందాల తార నయనతార. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. మలయాళ అగ్రకథానాయకుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ చిత్రంలో నయనతార కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. ‘ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్.. మమ్ముట్టితో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆయనతో జోడీ కట్టడానికి నయన్‌తో చర్చలు జరుపుతోంది చిత్రబృందం.
త్వరలో దీనికి సంబంధించిన వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నార‘ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మమ్ముట్టి, నయన్ కాంబినేషన్‌లో వచ్చిన ’పుతియా నియమమ్’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించనుందో చూడాలి. ప్రస్తుతం ’డియర్ స్టూడెంట్స్’ చిత్రీకరణలో ఉంది నయన్.