15-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 15: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో అత్యవసరంగా సమావేశం అయ్యారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ కూడా పాల్గొన్నారు.. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) సీరియస్ కావటం.. ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ఈ అత్యవసరం భేటీకి ప్రాధాన్యత ఏర్పడిరది.. ఇక, ఏపీలో ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చేందుకు రేపు
ఢిల్లీ వెళ్లనున్నారు సీఎస్, డీజీపీ..అయితే, ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగేలా పాలనా వ్యవస్థ విఫలం కావడానికి కారణాలేమిటని కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించిన విషయం విదితమే.. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు బాధ్యులు ఎవరని సీఎస్, డీజీపీలను ప్రశ్నించింది ఈసీ. హింసాత్మక ఘటనల తర్వాత నివారణా చర్యలు ఏం తీసుకున్నారంటూ అధికారులను ప్రశ్నించిన విషయం విదితమే.. ఈ అంశాలపై అత్యవసరంగా భేటీ అయిన డీజీపీ, సీఎస్, ఇంటెలిజెన్స్ ఏడీజీలు.. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలు.. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాల్సిన వివరణపై చర్చించినట్టుగా తెలుస్తోంది.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తరుణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సీరియస్ అయ్యింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) ఏపీలో ఎన్నికల నిర్వహణ, పోల్ అనంతర హింసపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ.. సున్నిత ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న సమాచారం ఉన్నా.. ఎందుకు ఈ స్థాయిలో హింస చేలరేగుతోందని మండిపడిరది.. సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాలకు సమన్లు జారీ చేసింది.. హింసాత్మక ఘటనలు, వాటికి అరికట్టడంలో జరిగిన వైఫల్యాలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.. అంతేకాదు..
ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొన్న విషయం విదితమే.