15-05-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, మే 15: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వృద్ధ దంపతులు సూర్యనారాయణ, రుక్మిణి అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. బోనకల్ మండలం ముష్టికుంట్ల సవిూపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయాలతో అపస్మారక స్థితిలో యువకులిద్దరినీ ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వృద్ధ దంపతులు మామిళ్లగూడేనికి చెందినవారిగా గుర్తించారు.