ad1
ad1
Card image cap
Tags  

  16-05-2024       RJ

ధాన్యం కొనుగోళ్లలో.. అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతల ఆందోళన

తెలంగాణ

వరంగల్‌/నిజామాబాద్‌, మే 16: అన్నదాతలను ఏ ప్రబుత్వం వచ్చినా ఆదుకోవడం లేదన్నది అర్థం అయ్యింది. వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు లబోదిబోమంటున్నా అధికారులు మాత్రం రైతుల వద్దకు వెళ్లడం లేదు. మార్కెట్‌ కమిటీలు ఉన్నా ఉత్తిదే అని తేలింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటనలకే పరిమితం అయ్యారు. ఇటీవల ధాన్యం అకాల వర్షాలకు పూర్తిగా తడిసిపోయింది. అలాగే ధాన్యం కొనుగోళ్లు చురుకుగా సాగడం లేదు. గత ప్రభుత్వం ప్రచారార్భాటం చేసిందే తప్ప కొనుగోళ్లపై చిత్తశుద్ది ప్రకటించలేదు. ఇప్పుడేమో ధర్నాలు, ఆందోళనలకు బిఆర్‌ఎస్‌ 
పిలుపునివ్వటం సిగ్గుచేటు. ఇకపోతే కాంగ్రెస్‌ కూడా అదే దారిలో నాడుస్తోంది. క్షేత్రస్థాయిలో మార్కెటింగ్‌ సిబ్బందిని పంపి ధాన్యం మొత్తాన్ని కొనేలా ప్రణాళికలు సిద్దం చేయలేదు. దీంతో ఆరుగాలం కష్టపడి పండిరచిన రైతులు పంటను అమ్ముకోవడం అన్నదాలకు కష్టంగా మారింది. ఇప్పటికే ధరల హెచ్చు తగ్గులతో తీవ్రంగా నష్టపోతుండగా, పంటను అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది.

వరి, వేరుశనగ, జొన్న,మక్కజొన్న ఇలా పంట ఏదైనా కొనుగోళ్లు సక్రమంగా లేవు. మిల్లుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. కొన్నిచోట్ల రైతులు మార్కెట్‌ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేయగా వ్యాపారులను అడగాలని సూచించారు. రైతులు మిల్లుల వద్దకు వెళ్లి వేరుశనగను కొనుగోలు చేయాలని కోరగా కొందరు నిరాకరించారు. మరికొందరు క్వింటాల్‌కి రూ.4వేల చొప్పున ఖరీదు చేస్తామని చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసి ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో చేసేదేవిూ లేక వరంగల్‌ జిల్లాలో వేరుశనగ  రైతులు మళ్లీ బస్తాల్లో నింపుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. పంట పండిరచడం ఒక ఎత్తయితే పంట అమ్ముకోవడం మరో ఎత్తవుతున్నది. మార్కెట్‌లో వేరుశనగను ఎవరూ ఖరీదు చేయకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. మిల్లుల వద్దకు వెళ్లి అడిగితే తక్కువ ధరకు కొంటామంటున్నరు.

ఎకరానికి 10 క్వింటాళ్లకు పైగా దిగుబడి రావాల్సి ఉండగా, 5 క్వింటాళ్లే వచ్చింది. దిగుబడి తగ్గి నష్టపోగా, ధర లేకపోవడం, వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో సాగుచేయడం భారంగా మారుతోంది. మద్దతు ధర పెట్టిన పెట్టుబడి రాక ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. మద్దతు ధర చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది.  ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అకాల వర్షానికి వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లాలో న్నదాతలు ఆందోళన చేపట్టారు. ధాన్యం తూకం వేయకుండా, తూకం వేసిన ధాన్యం తరలించకుండా నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల తీరుకు నిరసనగా బోధన్‌`హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. ఐదు రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని, రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ధాన్యం తడుస్తున్నదని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల్లో కాంటాల సంఖ్య పెంచి లారీల కొరత తీరుస్తామని హావిూ ఇవ్వాలని కోరుతున్నారు. తామే కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం పది రోజుల నుంచి తూకం చేయడం లేదు. సొసైటీ వాళ్లను అడిగితే రైస్‌మిల్లర్లు వద్దని చెబుతున్నారని సమాధానం ఇస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి మా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ధాన్యం కొనకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసింది. మొలకలు వస్తున్నాయి. అధికారులు స్పందించి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాల్సి ఉంది. ఇకపోతే ఇటీవల కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. పలు గ్రామాల రైతులు విక్రయానికి తీసుకొచ్చిన జొన్నలతోపాటు తూకం వేసిన జొన్న బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి.

జొన్నలను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చామని, తూకం వేసిన అనంతరం లారీల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని రైతులు తెలిపారు. జొన్న బస్తాలను తరలించేందుకు ఒక్కో బస్తాకి రూ.10`రూ.20 తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రం అంతటా ఇదే దుస్థితి నెలకొంది. వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టి రైతులకు ఊరట కల్పించాల్సి ఉంది. ఈ విషయంలో రేవంత్‌ ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో అధికారులకు గట్టి ఆదేశాలు ఇవ్వాలి. 

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP