ad1
ad1
Card image cap
Tags  

  16-05-2024       RJ

పదకవితా పితామహుడు అన్నమయ్య

ఆంధ్రప్రదేశ్

తిరుమల, మే 16: పదకవితా పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయ కారుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు. ఆయన తన కీర్తనలతో వెంకటేశ్వరుడిని సేవించి తరించారు. సుమారు 32,000 కీర్తనలు శ్రీవేంకటేశ్వరుని ప్రీత్యర్థం పాడిన మహోన్నత ధన్యజీవి మన అన్నమయ్య. సర్వజీవులలో సర్వాత్మలకు ఆత్మ అయిన శ్రీహరిని చూస్తూ, తత్ఫలితంగా సమస్తాన్నీ ఆ భగవంతుని సంబంధంలోనే చూసేవాడు, సమస్తం ఆ దేవదేవునిలోనే నిత్యవిలసితమై ఉన్నదని ఎరిగి ఉండేవాడే భాగవతోత్తముడు’. ఈ నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం... మన భక్త కవితా పితామహుడు అన్నమయ్య. వారి తల్లిదండ్రులు శ్రీమాన్‌ నారాయణసూరి, లక్కమాంబ. వైశాఖ పూర్ణిమనాడు జన్మించిన అన్నమయ్య 95 సంవత్సరాలు శ్రీవేంకటేశ్వరుని సంగీతమయ ఆరాధనలో తన్మయులై జీవించారు...శ్రీ వేంకటేశ్వరుడి పరమభక్తుడు, పదకవితాపితామహుడు అయిన అన్నమయ్య తిరుమలలో ఘనముని అనే గురువు వద్ద వైష్ణవమతాన్ని స్వీకరించారు. కానీ వైష్ణవమత ప్రచారకర్త, విశిష్టాద్వైత సిద్దాంతవేత్త అయిన రామానుజాచార్యులనే పరమగురువుగా భావించారు.

ప్రత్యక్షంగా చూడకపోయినా, ఆయన బోధనలనే అనుసరించారు. రామానుజులపై కీర్తనలు కూడా రచించారు. ’గురుకృప వల్లనే వేద రహస్యాలు తెలుసుకోగలిగాను. అహంకారాన్ని పోగొట్టి శరణాగత తత్త్వాన్ని అలవరచారు’ అంటూ ’గతులన్ని ఖిలమైన కలియుగ మందును... గతి ఈతడే చూపె ఘన గురు దైవము’ అంటూ సంకీర్తించారు. శ్రీమహావిష్ణువు ’నందక’మనే ఖడ్గం అంశతో జన్మించిన అన్నమాచార్యులు భగవదాజ్ఞపైనే రోజుకొక కీర్తన రాసే సంకల్పంతో ముందుకు సాగి, స్వామి దివ్యానుగ్రహానికి పాత్రులయ్యారు. ’భగవత్కీర్తనతో పరవశించే తన నాలుక ఇతరులను కీర్తించదని’ నిక్కచ్చిగా పలికిన కారణంగా ఆయన ఆనాటి రాజు క్రోధానికి గురై, కారాగారానికి కూడ వెళ్ళారు. కానీ, శ్రీవేంకటేశ్వరుని కీర్తనా మహిమతో ఆయన చేతులకు వేసిన గొలుసులు వాటంతటవే తొలగి కింద పడ్డాయి. ’అదివో అల్లదివో శ్రీహరి వాసము..’ అంటూ ప్రారంభమైన శ్రీఅన్నమయ్య అద్భుత కీర్తనారaరి నిరంతరం స్వామివారి సమస్త కల్యాణ గుణాలను, పండుగలను, విలాసాలను, లీలలను, భక్తరక్షణ కార్యాలను ఆద్యంతం అభివర్ణిస్తుంటే, అందరం అలా మైమరిచి, పులకితులం కావాల్సిందే.

వారి కీర్తనలలో సుమారు 12,000 మాత్రమే ఇప్పుడు లభ్యమవుతున్నాయి. శ్రీఅన్నమాచార్యులు జన్మించిన ఊరు కడప జిల్లా రాజంపేట తాలూకాలోని తాళ్ళపాక. ఆ ఊరే ఆయనకు ఇంటిపేరు అయింది. తిమ్మక్క, అక్కలమ్మ ఆయన సతీమణులు. అన్నమయ్య వంశీకులుకూడ మంచి కవులు. ’చందమామ రావో జాబిల్లి రావో’ అని ఆయన రాసిన పాటను ప్రతీ ఇంట శాశ్వతంగా ప్రేమతో తల్లులు పాడుకుంటారు. ’బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’, ’పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా’, ’బ్రహ్మ కడిగిన పాదము’, ’కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు’, ’ముద్దుగారే యశోద’, ’ఏమొకో చిగురుటధరమున’.. వంటి ఎన్నెన్నో భక్తి కీర్తనలు తిరుమల కొండలలో, భక్తుల గుండెల్లో నిరంతరం మారుమోగుతూనే ఉంటాయి. సంకీర్తనలద్వారా శ్రీవేంకటేశ్వరుని నిత్యం ఆరాధించే సంప్రదాయాన్ని అన్నమయ్య తన తర్వాత తన పుత్రుడైన పెదతిరుమలయ్యకు అందించారు. వారే తన తండ్రి కీర్తనలను రాగి ఫలకాలపై రాయించి ఉంచడంతో నేటికి అవి మనకు భాగ్యవశాత్తుగా లభిస్తున్నాయి.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP