ad1
ad1
Card image cap
Tags  

  16-05-2024       RJ

డీఎంహెచ్‌ఓ మెడికల్‌ అధికారిపై సర్వత్రా ఆగ్రహం

తెలంగాణ

కామారెడ్డి, మే 16: మహిళ మెడికల్‌ ఆఫీసర్లను కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్‌ సింగ్‌ లైంగిక వేధింపుల ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలో డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్‌ సింగ్‌ పై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా మెడికల్‌ ఆఫీసర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద 7 కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. తమను ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో మహిళ మెడికల్‌ ఆఫీసర్లు పేర్కొన్నారు. డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్‌ సింగ్‌ను దేవునిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కామారెడ్డి డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది కాలంగా తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మహిళ మెడికల్‌ ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై రాష్ట్ర వైద్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు, వేధింపుల ఘటనపై డీఎంహెచ్‌ఓపై ఉన్నతాధికారులు సైతం ఫైర్‌ అయ్యారు. లైంగిక వేధింపుల ఘటనపై డైరక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఫ్యామిలీ అడిషనల్‌ డైరక్టర్‌ అమర్‌ సింగ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ విచారణలో తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారని 10 మందికి పైగా మహిళా మెడికల్‌ ఆఫీసర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌ సింగ్‌, సూపరింటెండెంట్‌ శ్రీనునాయక్‌ను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్‌ సింగ్‌, శ్రీనునాయక్‌పై తాజాగా మరికొందరు పీహెచ్‌సీల మహిళా మెడికల్‌ ఆఫీసర్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు అధికారులపై 354, 354 డీ, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.

డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌ సింగ్‌, సూపరింటెండెంట్‌ శ్రీనునాయక్‌ తనిఖీల పేరిట వస్తూ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ జిల్లాలోని పలు పీహెచ్‌సీలకు చెందిన 21 మంది మహిళా మెడికల్‌ ఆఫీసర్లు 10 రోజుల కింద వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. ’పీహెచ్‌సీకి వచ్చినప్పుడు డీఎంహెచ్‌వో పక్కన కూర్చొమనేవారు.. కూర్చోకపోతే పనిలో లోపాలు వెతికి వేధించేవారు. ఫోన్‌ చేసి మరీ సంసారం జీవితం ఎలా సాగుతుందంటూ అభ్యంతరకరంగా మాట్లాడేవారు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏడీహెచ్‌ అమర్‌సింగ్‌ నాయక్‌ బుధవారం కామారెడ్డి డీఎంహెచ్‌వో కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఇరు వర్గాలను పిలిపించి.. వారితో మాట్లాడారు. విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అక్కడికి చేరుకోగా.. వేధింపుల విషయాన్ని పలువురు మహిళా ఉద్యోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

అయితే నిబంధనలకు విరుద్ధంగా విచారణ జరుగుతోందని ఎమ్మెల్యే తప్పుబట్టారు. బాధిత మహిళా ఉద్యోగులతో పాటు మరికొందరు అధికారులూ ఇక్కడికి రావాలన్నారు. డీఎంహెచ్‌వో, సూపరింటెండెంట్‌ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గత కొన్నేళ్లుగా వీరు ఉద్యోగాల నియామకాలు, డిప్యుటేషన్ల విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఏడీహెచ్‌ అమర్‌సింగ్‌.. డీఎంహెచ్‌వోతో పాటు ఇతర ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ అంశాన్ని రికార్డు చేశానని, విచారణ నివేదికలో వాటిని పొందుపర్చి.. ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఆయన వెల్లడిరచారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP