16-05-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్, మే 16: బిసిలను అణగదొక్కుతూ ఇప్పటికీ అగ్రవర్ణాలే రాజ్యమేలుతున్నారని బీసీ సంక్షేమసంఘ నేతలు ఆరోపించారు. బీసీలకు సామాజిక భద్రత కల్పించడానికి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీ యాక్టును తీసుకురావాలని డిమాండ్ చేశారు. అరవై ఏళ్ల స్వాతంత్యద్రేశంలో బీసీలకు అన్నివిధాలా అన్యాయం జరిగిందన్నారు. జనాభాప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరముందని చెప్పారు. కొత్తగా ఏర్పడే పార్లమెంటులో బీసీలకు 50శాతం రిజిర్వేషన్లు కల్పిస్తూ బీసీబిల్లును పెట్టాలని అన్నారు. ముస్లింలకు బీసీలతో కాకుండా ప్రత్యేకకోటా ద్వారా రిజర్వేషన్లు వర్తింపజేయాలని సూచించారు. ఈమేరకు కేంద్రానికి నివేదించాలన్నారు. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని వాపోయారు.