16-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
గుంటూరు, మే 16: ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని హావిూ ఇచ్చి ఇప్పుడు ఔట్సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చడం అన్యాయమన్నారు. కార్మికుల కనీస వేతనం రూ.24 వేలు ఇచ్చి ఇతర సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.