16-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుపతి, మే 16: తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చేరువులో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. వడమాలపేట మండలం ఎస్బీఆర్‌పురానికి చెందిన బాలికలు స్థానిక శివాలయానికి వెళ్లారు. ఆ పక్కనే ఉన్న చెరువు దగ్గరకు వెళ్లగా వారు ప్రమాదవశాత్తు చెరువులో పడ్డారు. తొలుత ఓ బాలిక పడటంతో మిగిలిన ఇద్దరూ రక్షించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు కూడా చెరువులో పడ్డారని తెలుస్తోంది. ముగ్గురు బాలికల మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు బాలికల మృతిలో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.