16-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 16: హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సచివాలయంలోని అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాలపై సచివాలయంలో వివిధ శాఖల ముఖ్య అధికారులతో రేవంత్ రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సీఎం రేవంత్ సెక్రటేరియట్‌లో నిర్వహిస్తున్న సమావేశంలో రాష్టాన్రికి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయంపై అధికారులతో చర్చిస్తున్నారు. వాణిజ్య పన్ను, రవాణా, ఎక్సైజ్, రిజిస్టేష్రన్, స్టాంప్స్, మైనింగ్ శాఖల్లో ఆదాయ రాబడి వివరాలపై సీఎం ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం నిధుల సేకరణపై రేవంత్ సర్కార్ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఆదాయవనరులను అన్వేషిస్తోంది.