16-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 16: హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై తాజాగా ఎంఐఎం నేతలపై కేసు నమోదైంది. మాధవి లత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడిరచారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ లను పరిశీలించడానికి వెళ్లిన మాధవి లతపై యాకత్ పూర ఎంఐఎం ఇంఛార్జ్ యాసిర్ అర్ఫాత్ దాడి చేసేందుకు ప్రయత్నించారని నసీం అన్నారు. అంతేకాదు ఆమె కారులో వెళ్తున్న క్రమంలో కూడా పలువురు ఎంఐఎం నేతలు వెంట పడి దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు.
దీంతోపాటు బీబీ బజార్‌లో మాధవి లతను 100 మంది ఎంఐఎం నాయకులు ముట్టడిరచారని తెలిపారు. ఈ నేపథ్యంలో వీరందరికీ పోలీసులు 41 ఞసూఞ నోటీసులు జారీ చేయనున్నారు. మరోవైపు హైదరాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో భారీ రిగ్గింగ్ జరిగిందని కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాలని మాధవి లత వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గంలో రిగ్గింగ్‌పై ఫిర్యాదులు చేసినా పోలీసులు మౌనంగా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. 16 ఏళ్ల బాలిక రెండుసార్లు ఓటు వేయడానికి ప్రయత్నించిందని, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని అన్నారు.