ad1
ad1
Card image cap
Tags  

  16-05-2024       RJ

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికపై పార్టీల దృష్టి

తెలంగాణ

హైదరాబాద్‌, మే 16: తెలంగాణ పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌  ముగిసిన వెంటనే వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక హదహుడి మొదలైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మల్యేగా ఎన్నిక కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. పోటీ చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈనెల 27 న పోలింగ్‌ జరగనుండడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకేష్‌ రెడ్డి. బిజెపి నుండి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో అన్నారు.

పోలింగ్‌కు పది రోజల సమయం ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 2021 వ సంవత్సరంలో వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీ అర్‌ ఎస్‌ నుండి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి విజయం సాధించారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో పల్ల రాజేశ్వర్‌ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2021 జరిగిన ఎన్నికల్లో బీ అర్‌ ఎస్‌ నుండి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, బిజేపి నుండి గుజ్జుల ప్రేమెందర్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న పోటీ చేయగా కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలబెట్టలేదు. 2021 ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, తీన్మార్‌ మల్లన్న నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడగా పల్లా విజయం సాధించారు. ఈ నెల 27 న పోలింగ్‌ జరగనుండడంతో 10 రోజుల సమయం ఉండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

బీఅర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న, బిజెపి అభ్యర్థిగా గుజ్జులా ప్రేమేందర్‌ రెడ్డి తోపాటు 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న బీ అర్‌ ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోటి ఉండనుంది. తీన్మార్‌ మల్లన్న 2021 ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిపోయారు. ఈ సారి ఓటమి సానుభూతితో పాటు కాంగ్రెస్‌ అధికారంలో ఉండటం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇక బీ అర్‌ ఎస్‌ అభ్యర్థి ఏనుగు రాకేష్‌ రెడ్డి బిట్స్‌ ఫీలాని స్టూడెంట్‌గా పేరుంది. అంతే కాకుండా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు బీజీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గా పనిచేశారు. అంతే కాకుండా బీ అర్‌ ఎస్‌ లో పల్లా వర్గంగా పేరుంది. కాబట్టి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి , రాకేష్‌ రెడ్డి కోసం తీవ్ర కృషి చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గుజ్జులా ప్రేమేందర్‌ రెడ్డి పెద్దగా ప్రభావం చూపెట్టక పోవచ్చు.

ఎందుకంటే ప్రేమేందర్‌ రెడ్డి గత రెండు ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపెట్టలేదు. అంతేకాకుండా బిజెపి నుండి కొంత ఓటింగ్‌ రాకేష్‌ రెడ్డికి పోలింగ్‌ అయ్యే అవకాశం లేకపోలేదు. కాబట్టి పోటీ ఇద్దరి మధ్య ఉందని చెప్పవచ్చు. 2021 ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ ఓటు హక్కును ఐదు లక్షల మందికిపైగా నమోదు చేసుకున్నారు. ఉప ఎన్నికపై ఇతరుల పట్టభద్రులకు పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఓటింగ్‌ నమోదుకు వెనుకడుగు వేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాలో 4 లక్షల 27 వేల 289 మంది పట్టభద్రులు మాత్రమే తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. అయితే మూడు జిల్లాల పరిధిలో పట్టబద్రుల సంఖ్య లక్షల్లో ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటు నమోదు చేసుకున్నందుకు పట్టభద్రుల ఆసక్తి చూపలేదని చెప్పవచ్చు.

ఈనెల 27న జరిగే ఎన్నికల్లో కూడా ఓటు వేసేందుకు పట్టభద్రులు ఉత్సాహం ప్రదర్శిస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష బిజెపి పార్టీలు ఛాలెంజ్‌ గా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్‌ స్థానాన్ని వదులుకోకూడదని బీఆర్‌ఎస్‌. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడం కోసం తీవ్ర కసరత్తు చేస్తుంది. ఆయా పార్టీల నేతల సైతం ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో పట్టభద్రుల స్థానాన్ని వదులుకోవద్దని రెండు పార్టీలు చూస్తున్నాయి.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP