16-05-2024 RJ
సినీ స్క్రీన్
కాంబినేషన్‌లోనే వచ్చిన హిట్ సినిమా ’భారతీయుడు’కు సీక్వెల్‌గా ఇది రానుంది. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని అప్‌డేట్స్ సోషల్ విూడియాలో వైరల్‌గా మారాయి. మూడో భాగంపై కూడా వార్తలు వస్తుండడంతో సినీ ప్రియులు సంబర పడుతున్నారు. ’భారతీయుడు 2’తో పాటే మూడో భాగాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు టీమ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్ట్ 3కు సంబంధించిన షూటింగ్‌ను కూడా శంకర్ కంప్లీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలను ఏడాదిలోపే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ’భారతీయుడు 2’ ట్రైలర్ రిలీజ్ కోసం యూనిట్ ఓ భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే పనులు పూర్తయినట్లు టాక్.
జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చిత్రబృందం గతంలోనే తెలిపింది. జూన్‌కు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కష్టమని అందుకే దీన్ని జులై 12కు వాయిదా వేసినట్లు టాక్ వినిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మూవీ టీమ్ భారీ సర్‌ప్రైజ్‌కు చేసినట్లు తెలుస్తోంది. పార్ట్2 కైమాక్స్‌లోనే మూడో భాగం ట్రైలర్‌ను ప్రదర్శించాలని చూస్తోందట. దానితో పాటే పార్ట్`3 విడుదల తేదీని కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
1996లో శంకర్ దర్శకత్వంలో వచ్చి సంచలనం సృష్టించింది ’భారతీయుడు’. సేనాపతి పాత్రలో కమల్ ఆహార్యం, హావభావాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ’భారతీయుడు 2’ మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైంది. ఇది విడుదలైన వెంటనే మూడో భాగానికి సంబంధించిన నిర్మాణాంతర పనుల్ని మొదలు పెట్టనున్నారు.